వరంగల్, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ ప్రజలకు కేంద్రం ప్రత్యేక సూచన

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగించారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

సికింద్రాబాద్‌-తిరుపతి (07482) రైలు డిసెంబరు 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.ఈ రైళ్లు జనగాం, వరంగల్, ఖాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

special trains between tirupathi and secunderabad

హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం;
నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం;
ఈ రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.

కాకినాడ-లింగంపల్లి (07445) డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో;
లింగంపల్లి-కాకినాడ (07446) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయల్దేరతాయి.
ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఆకివీడు, గుడివాడ, భీమవరం, తణుకు, కైకలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

సంక్రాంతి పండగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, నర్సాపూర్, విజయవాడ, తిరుపతి, చెన్నైవైపు ప్రయాణించే రైళ్లల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండనుండటంతో సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+