ఓన్లీ విశాఖపట్నం వారికి మాత్రమే!
రానున్నది దసరా, దీపావళి పండగల సీజన్ కావడంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను విశాఖపట్నం వరకు పొడిగించింది. మరికొన్నింటిని విశాఖపట్నం నుంచి ఏర్పాటు చేసింది. వాటి వివరాలు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ వరకు
* నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు పొడిగించారు. బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
* నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 5 నుంచి 2023 నవంబర్ 30 వరకు పొడిగించారు. గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

తిరుపతి వరకు
* నెంబర్ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు పొడిగించారు. సోమవారం రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరితే తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
* నెంబర్ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు పొడిగించారు.
రైలు ప్రతీ మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
* దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. 1 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 9 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ బోగీలు ఉంటాయి.












Click it and Unblock the Notifications