ఏపీ మీదుగా పండగ ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు
Special Trains: శ్రావణమాసం రాకతో పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఇప్పుడు తాజాగా మరో మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే ఈ మూడింటినీ కూడా సదరన్ రైల్వే ఆపరేట్ చేయనుంది. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి, కోయంబత్తూర్- ధన్ బాద్, పొదనూర్- బరౌనీ మధ్య ఇవి పట్టాలెక్కనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి..
సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి శనివారం చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06077ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 7:15 నిమిషాలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో ప్రతి సోమవారం సంత్రాగచ్చి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరే నంబర్ 06078 ప్రత్యేక రైలు రెండో రోజు మద్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుకుంటుంది.
గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగం, శ్రీకాకులం, పలాస, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
కోయంబత్తూర్- ధన్ బాద్..
సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 11:50 నిమిషాలకు కోయంబత్తూర్ నుంచి బయలుదేరే నంబర్ 06063 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 8:30 గంటలకు ధన్ బాద్ కు చేరుకుంటుంది.
సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతి సోమవారం ధన్ బాద్ నుంచి మధ్యాహ్నం 3:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06064 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 6 గంటలకు కోయంబత్తూర్ కు చేరుకుంటుంది.
తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట్టై, కాట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ, టిట్లాగఢ్, సంబాల్ పూర్, ఝార్సుగూడ, రూర్కేలా, హాతియా, రాంచీ, మూరీ, బొకారా స్టీల్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
పొదనూర్- బరౌనీ
సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి శనివారం ఉదయం 11:50 నిమిషాలకు పొదనూర్ నుంచి బయలుదేరే నంబర్ 06055 ప్రత్యేక రైలు మూడో రోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బరౌనీ చేరుకుంటుంది.
సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11:45 నిమిషాలకు బరౌనీ నుంచి బయలుదేరే నంబర్ 06056 ప్రత్యేక రైలు మూడో రోజు మధ్యాహ్నం 3:45 నిమిషాలకు పొదనూర్ చేరుకుంటుంది.
తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట్టై, కాట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ, టిట్లాగఢ్, సంబాల్ పూర్, ఝార్సుగూడ, రూర్కేలా, హాతియా, రాంచీ, మూరీ, బొకారా స్టీల్, ధన్ బాద్, బరాకార్, చిత్తరంజన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications