ఏపీకి నరేంద్రమోడీ గుడ్ న్యూస్
ఏపీ ప్రజలకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త వినిపించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ నెల 12, 19, 26న కోయంబత్తూరు-బరౌని(06059) అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైలు ఉదయం 11.30గంటలకు కోయంబత్తూరులో బయలుదేరి.. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 12.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 12.10 గంటలకు దువ్వాడ నుంచి బయలుదేరుతుంది.
బరౌని-పొదనూరు(06060) ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఈనెల 14, 21, 28 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బరౌనిలో బయలుదేరి మూడో రోజు తెల్లవారుజామున 3.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నాలుగు గంటలకు బయలుదేరి వెళుతుంది.

ఈనెల 13, 20, 27 తేదీల్లో తాంబరం-సంత్రాగచ్చి(06079) ప్రత్యేక రైలు మధ్యాహ్నం 1.00 గంటకు తాంబరంలో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 2.35 గంటలకు బయలుదేరి వెళుతుంది.
సంత్రాగచ్చి-తాంబరం(06080) ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28 తేదీల్లో రాత్రి 11.40గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి తర్వాత రోజు సాయంత్రం 4.55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సాయంత్రం 5.00 గంటలకు బయలుదేరి వెళుతుంది.

ఈనెల 12, 19, 26 తేదీల్లో తాంబరం-సంత్రాగచ్చి(06053) ప్రత్యేక రైలు రాత్రి 10.30గంటలకు తాంబరంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15గంటలకు దువ్వాడ చేరుకుని ఇక్కడి నుంచి 11.17 గంటలకు బయలుదేరి వెళుతుంది.
సంత్రాగచ్చి-తాంబరం(060504) ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28 తేదీల్లో ఉదయం 5.00 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి అదే రోజు రాత్రి 8.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 8.50 గంటలకు బయలుదేరి వెళుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications