విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మూడు స్కిల్స్ ఉంటేనే జనసేనలోకి ఎంట్రీ? పక్కపార్టీని విమర్శిస్తే ఇంటికే?

సమాజంపై లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్నవారికే జనసేనలో కార్యకర్తలుగా ఎంపిక చేయనున్నారు. త్రిసూత్ర విధానంతో కార్యకర్తలను ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నిపుణులచ సమక్షంలో కార్యకర్తల ఎంపిక కోసం పరీక్షలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:సమాజంపై లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్నవారికే జనసేనలో కార్యకర్తలుగా ఎంపిక చేయనున్నారు. త్రిసూత్ర విధానంతో కార్యకర్తలను ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. నిపుణులచ సమక్షంలో కార్యకర్తల ఎంపిక కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన పోటీచేస్తోందని ఆ పార్టీ చీఫ్ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అయితే ఎన్నికల నాటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగాను జనసేన ప్రయత్నాలను ప్రారంభించింది.

జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నవారి నుండి ధరఖాస్తులను సేకరించి వడపోత పద్దతిలో ఎంపికచేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని సమాజం పట్ల అవగాహాన, సామాజిక స్పృహ ఉన్నవారినే లక్ష్యంగా చేసుకొని జనసేన తమ పార్టీలోకి తీసుకొంటోంది.

ఈ మేరకు జనసేనలో చేరేవారికి ఉన్న లక్షణాలు ఏమిటనే విషయాన్ని తొలుత పరీక్షిస్తున్నారు. అంతేకాదు సమాజంపై ఉన్న అవగాహనతో పాటు స్థానిక సమస్యలపై వారికి ఉన్న పట్టు తదితర అంశాలను పరీక్షించిన తర్వాతే జనసేనలోకి ఎంట్రీ దక్కుతోంది.

ఆ మూడు లక్షణాలుంటేనే జనసేనలోకి ఎంట్రీ

ఆ మూడు లక్షణాలుంటేనే జనసేనలోకి ఎంట్రీ

మూడు రకాల పరీక్షల్లో ప్రతిభ కనబర్చినవారికే జనసేనలో ఎంట్రీ దక్కనుంది. ఎదుటివారికి ఆకట్టుకొనేలా మాట్లాడడడం, ఏదైనా విషయంపై అందరికీ అర్థమయ్యే పద్దతిలో రాయడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించవచ్చునో చెప్పడం, దీనికితోడుగా ఈ సమస్యతో పాటు ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను విశ్లేషించగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ మూడు అంశాలపై అభ్యర్థులను పరీక్షించిన తర్వాతనే ఎంపిక చేస్తున్నారు. గంటపాటు నిర్వహించే పరీక్షల్లో ఏయే ప్రశ్నలు అడగాలనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు.

స్థానిక సమస్యలపై అభ్యర్థులకు పరీక్ష

స్థానిక సమస్యలపై అభ్యర్థులకు పరీక్ష

పార్టీలో చేరాలనుకొనేవారికి స్థానిక సమస్యలపై ఉన్న అవగాహానను పరిశీలిస్తున్నారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. అంతే కాదు పార్టీ నియమించిన నిపుణుల ముందు స్థానిక సమస్యలను ప్రస్తావించాల్సి ఉంటుంది.


ఆయా సమస్యలకు పరిష్కారమార్గాలను సూచించాలి. మరో వైపు నిపుణులు ఇచ్చిన సబ్జెక్ట్ లేదా స్థానికంగా ఉన్న సమస్యలపై అభ్యర్థులు ప్రసంగించాల్సి ఉంటుంది.ఇక కంటెంట్ రైటర్స్, ఎనలిస్టులు మాత్రం ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే చాలు. పరీక్ష ముగిసిన తర్వాత కార్యకర్తలను ఎంపికచేయడానికి వారానిపైగా సమాయం తీసుకొంటున్నారు. ఆయా అభ్యర్థుల వీడియో ప్రసంగాలు, రాతపరీక్షల సమాధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి పార్టీలోకి అవకాశం కల్పిస్తున్నారు.

ఇతర పార్టీలను విమర్శిస్తే ఇక అంతే

ఇతర పార్టీలను విమర్శిస్తే ఇక అంతే

ఉపన్యాస విభాగంలో అభ్యర్థుల ఉపన్యాసాలను వీడియో రికార్డింగ్ చేస్తారు. ఈ ప్రసంగాలను నిపుణులు ఒకటికి రెండుసార్లు వింటారు. వారు మాట్లాడిన విధానం, భాషపై ఉన్న పట్టు, ప్రసంగించిన సబ్జెక్టుపై అవగాహన తదితర అంశాలను పరిశీలిస్తారు. ఇతర పార్టీలను నేతలను విమర్శిస్తే అలాంటివారిని పక్కనపెడుతున్నారు. సమస్యలపైనే మాట్లాడాలి. ఇతరత్రా అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. రాతపరీక్ష విషయంలోనూ ఇవే జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఉన్నత విద్యావంతులే అధికం

ఉన్నత విద్యావంతులే అధికం

ఉన్నతవిద్యావంతులే అధికంగా పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు.బీటెక్ , ఎంటెక్, పీహెచ్ డీ చేసిన వారు కూడ జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అనంతపురం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎంపికచేసిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతపురంలో నిర్వహించిన పరీక్షకు 3200 మంది హజరయ్యారు.వారిలో కేవలం147 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు 6250 మంది హజరైతే మూడు విభాగాలకు ఒక్కో జిల్లాకు 25 మందిని మాత్రమే ఎంపిక చేశారు.

 పవన్ తో వర్క్ షాప్

పవన్ తో వర్క్ షాప్


జనసేనలోకి వచ్చే కార్యకర్తలకు అన్ని విషయాల్లో నైపుణ్యంతో పాటు మంచి అవగాహన కలిగి ఉండాలనేది సిద్దాంతమని జనసేన ఏపీ మీడియా వ్యవహరాల ఇన్ చార్జీ పి. హరిప్రసాద్ చెప్పారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారితో పవన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే అనంతపురం నుండి ఎంపికైన వారితో పవన్ సమావేశమయ్యారు. త్వరలో ఉత్తరాంధ్ర కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.పార్టీలో హోదాలు ఉండవు. పార్టీలో పూర్తిగా కార్యకర్తలే ఉంటారు. పార్టీకోసం పనిచేసేవారికి హోదాలుండవు. అయితే ప్రస్తుతం ఎంపికచేసినవారిలో కొందరికి 2019 లో టిక్కెట్లు కూడ ఇచ్చే అవకాశం ఉంది.

English summary
speech, local issues, writing skills is the most important for joing in to Janasena party.Party take care in this three issues. Janasena chief pawan kalyan planning to contest in 2019 elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X