కేజ్రీవాల్‌తో పోలికేది, అదృష్టవశాత్తు ఐఎఎస్: జెపిపై శ్రవణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగించేందుకే జెపి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీకి లోక్‌సత్తాకు పొంతనే లేదని, ఎందుకోసం, ఎవరికోసం పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.
సొంత సామాజికవర్గం ప్రయోజనాల కోసం తపించడం మినహా లోక్‌సత్తా ప్రజల కోసం చేసిందేమీలేదన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం సత్తా చేసిందేముందో చెప్పాలన్నారు. కేజ్రీవాల్ ప్రజల కోసం ఉద్యమిస్తే, జెపి తన కోసం ఒక్కసీటు నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ లోక్‌సత్తాతో పొత్తుపెట్టుకుంటే జెపి ఆ పార్టీని గంగలో కలిపేస్తాడని అన్నారు.
ఆంధ్రా పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం జెపి పని చేస్తున్నాడని ఆరోపించారు.. రాజకీయ నాయకులైన కాంట్రాక్టర్లు రాయపాటి, కావూరి, లగడపాటిల అక్రమాలు జెపికి ఎందుకు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై జెపి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications