శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మంత్రి, నిర్మాత సురేష్
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మంత్రి, నిర్మాత సురేష్
చిత్తూరు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో శ్రీలంక మంత్రి నిషాంత ముతుహెట్టి గామా, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపటి సురేష్ బాబు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంక నౌకాయానా శాఖ ఉప మంత్రి నిషాంత ముతుహెట్టిగామాకు టీటీడీ అధికారులు వీరికి ప్రత్యేక బస ఏర్పాట్లు చేసారు. అనంతరం శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయం లో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వారు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ మర్యాదలతో రంగానాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా.., ఉన్నతాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.












Click it and Unblock the Notifications