TTD: టీటీడీ అప్రమత్తం - కీలక నిర్ణయాలు..!!

భారీ వర్షాలతో టీటీడీ అప్రమత్తం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. ప్రతీ నెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు రాత్రి తిరుమల మాడ వీధుల్లో
శ్రీమలయప్ప స్వామివారు గరుడుని పై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భారీ వర్షాలతో
భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో టీటీడీ ఈవో ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేసారు. ఇప్పటికే తిరుమలతో సహా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నడక మార్గంలో ప్రత్యేకంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందనే అలర్ట్స్ తో మెట్ల మార్గాన్ని ఈ రోజు వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

Sri Malayappa Swamy will take a celestial ride on Garuda Vahanam at four

ఈవో ఆదేశాలు
అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కొరకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

ముందస్తు చర్యలు
ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+