తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 19 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. 6 నుంచి 9 గంటల వరకు అర్చకులునామం కోపు, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, జాజికాయ, పసుపు, కుంకుమ, త్రిచూర్ణంవంటి పలు సుగంధ ద్రవ్యాల లేపనంతో గర్భాలయ గోడలు, పరివార దేవతామూర్తుల ఆలయ గోడలు, పైకప్పు, ప్రసాదాల పోటు, పూజా సామగ్రి, పాత్రలు, అమ్మవారి వాహన సేవలను శుద్ధి చేశారు.

ధ్వజస్తంభం, బలిపీఠం, విమాన గోపురంతో ఆలయం మొత్తాన్ని శుద్ధిచేసి, నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌ దంపతులు, జేఈవో భాస్కర్‌ దంపతులు, ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీఈవో చెంచులక్ష్మి, పేష్కార్‌ నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్‌, ఆర్జితం, ప్రసాదాలు, వాహనాల ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి తిరుపతికి చెందిన నరసింహులు 18 పరదాలను కానుకగా అందజేశారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి తిరుపతికి చెందిన నరసింహులు 18 పరదాలను కానుకగా అందజేశారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ప్రతి సంవత్సరం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 19 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఉదయం 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు.

 ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

6 నుంచి 9 గంటల వరకు అర్చకులునామం కోపు, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, జాజికాయ, పసుపు, కుంకుమ, త్రిచూర్ణంవంటి పలు సుగంధ ద్రవ్యాల లేపనంతో గర్భాలయ గోడలు శుద్ధి చేశారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

పరివార దేవతామూర్తుల ఆలయ గోడలు, పైకప్పు, ప్రసాదాల పోటు, పూజా సామగ్రి, పాత్రలు, అమ్మవారి వాహన సేవలను శుద్ధి చేశారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ధ్వజస్తంభం, బలిపీఠం, విమాన గోపురంతో ఆలయం మొత్తాన్ని శుద్ధిచేసి, నీటితో శుభ్రం చేశారు.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌ దంపతులు, జేఈవో భాస్కర్‌ దంపతులు, ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీఈవో చెంచులక్ష్మి, పేష్కార్‌ నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్‌, ఆర్జితం, ప్రసాదాలు, వాహనాల ఇన్‌స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

English summary
The famous shrine of Goddess Sri Padmavathi Devi at Tiruchanoor donned a new and fresh look with the temple cleansing ritual of “Koil Alwar Tirumanjanam” which took place in a grand manner with religious pomp an gaiety on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X