అన్నా.. 41 ఏళ్ల రాజకీయం.. సీటిస్తే గెలుస్తావా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన హోరాహోరీగా పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం సిద్ధమయ్యాయి. జనసేన పార్టీతో పొత్త ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం ఈరోజు 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించారు. ఉమ్మడి వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. జనసేన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఆముదాలవలస. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బొడ్డేపల్లి సత్యవతి చేతిలో తమ్మినేని ఓటమి పాలయ్యారు. అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసినప్పటికీ పరాజయం తప్పలేదు.

srikakulam district amadalavalasa assembly constituency details

రాష్ట్ర విభజనతో వైసీపీ తీర్ణం పుచ్చుకొని 2004 ఎన్నికల్లో పోటీచేసి టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో రవికుమార్ మీద విజయం సాధించి స్పీకర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ప్రకటించిన టీడీపీ జాబితాలో రవికుమార్ కు సీటు దక్కడంతో ఆయన ఉత్సాహంగా పోటీకి సమాయత్తమవుతున్నారు. వైసీపీ తరఫున తమ్మినేనికే సీటు దక్కుతుందా? లేదంటే వేరే ఎవరైనా కొత్త నాయకుడు రంగంలోకి దిగుతారా? అనేది చూడాల్సి ఉంది. రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో వైసీపీగా ఉండగా, ఈసారి జనసేన, బీజేపీతో కలుపుకొని కూటమిగా వెళ్లి విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో టీడీపీ ఉంది. విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+