MLAగా పోటీకి సిద్ధమవుతున్న MP.. డైలమాలో చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీకి ఉత్త‌రాంధ్ర పెట్ట‌ని కోట‌. 2019 ఎన్నిక‌ల్లో అటువంటి కంచుకోట‌ల‌ను కూడా కోల్పోవాల్సి వ‌చ్చింది. వచ్చే ఎన్నికల్లో అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని పార్టీ అధినేత చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. గతంలో జరిగిన తప్పులను పరిశీలించుకుంటూ, ఎక్కడా చిన్న అలసత్వానికి తావులేకుండా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్త తలనొప్పి ప్రారంభమైంది. ఇక్కడ ఎంపీగా ఉన్న యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటున్నానంటూ చంద్రబాబు అనుమతి కోరుతున్నారు.

ఎంపీగా ఎవరు?

ఎంపీగా ఎవరు?

రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలనేది మరో సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా లోక్ సభ అభ్యర్థుల అన్వేషణలో ఉన్నాయి. ఆర్థిక బలం, అంగబలం దండిగా ఉన్న వ్యక్తులనే లోక్ సభకు దించాలనేది టీడీపీ, వైసీపీ వ్యూహంగా ఉంది. ఇటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే పోటీచేస్తే ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషించాల్సి ఉంటుంది. దీనివల్ల రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయి. అందుకే ఔనని కానీ, కాదనికానీ సమాధానం ఇవ్వడంలేదు.

జిల్లావ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని..

జిల్లావ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని..


రెండుసార్లు ఎంపీగా విజ‌యం సాధించిన రామ్మోహ‌న్నాయుడు ఎమ్మెల్యేగా పోటీచేయ‌డంవెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అవ్వాల‌నేది రామ్మోహ‌న్ కోరిక‌గా ఉంది. దీనివల్ల జిల్లావ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి వీలుంటుందని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీగా ఢిల్లీకే పరిమితమవడంవల్ల అటు పార్టీకి కానీ, ఇటు తనకుగానీ ఎటువంటి ప్రయోజనం ఉండటంలేదని వివరించారు.

రాజకీయ సమీకరణాలు మారతాయనే యోచనలో బాబు

రాజకీయ సమీకరణాలు మారతాయనే యోచనలో బాబు


నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని, అక్కడ ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న ర‌మ‌ణ‌మూర్తి రామ్మోహన్ నాయుడుకు మ‌ద్ద‌తిచ్చారని వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ‌నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి వీలుగా రామ్మోహన్ నాయుడు న‌ర‌స‌న్న‌పేట మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అక్క‌డి నుంచి పోటీచేయ‌డానికి ర‌మ‌ణ‌మూర్తి కూడా మ‌ద్ద‌తిచ్చారని బాబుకు చెప్పారు. దీనివల్ల జిల్లావ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉండటంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక కీలకమవుతుంది. రామ్మోహన్ అడిగినదానికి చంద్రబాబు ఔనన్నారా? కాదన్నారా? అనేది తెలియరాలేదు. త్వరలోనే ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+