కెసిఆర్‌తో ఒప్పందమేంటి: శ్రీకాంత్, అమరావతిలో ఆఫీస్ చూపించండి: బాబుతో ఉద్యోగులు
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చేసుకున్న ఒప్పందాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు పంచెలు, చీరలు ఇవ్వడంలోను అవినీతి జరిగిందన్నారు. నదుల అనుసంధానం జరిగితే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను, ప్రజలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంతో చేసుకున్న ఒప్పందమేమిటని ప్రశ్నించారు. నీటి కోసం కర్నాటక ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు.

అమరావతిలో మాకు కార్యాలయం చూపించండి: బాబుతో ఉద్యోగులు
అమరావతిలో తమకు కార్యాలయం చూపించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడిగారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు... అమరావతిలో తమకు ఆఫీస్ చూపించాలన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో స్థలం ఇస్తే ఇళ్లు కట్టుకుంటామని చెప్పారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చూడాలని వారు చంద్రబాబును కోరారు.
నెదర్లాండ్స్ వాణిజ్య బృందంతో చంద్రబాబు భేటీ
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెదర్లాండ్స్ వాణిజ్య బృందంతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు నెదర్లాండ్స్ బృందానికి వివరించారు.












Click it and Unblock the Notifications