గెలుపు కోసం బాబు దాడి చేయించుకున్నారు: శ్రీకాంత్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల్లో గెలుపు కోసమే నాడు చంద్రబాబు నాయుడు తన పైన దాడి చేయించుకున్నారని ఆరోపించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన వంద రోజుల పాలనలో వంద పిట్టకథలు చెప్పారన్నారు. సంక్షేమ పథకాలను ఎత్తేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. పచ్చచొక్కా వాళ్లే పథకాలకు అర్హులా అని ప్రశ్నించారు. పింఛన్లు తొలగిస్తే ప్రజలతో కలిసి తాము ఉద్యమిస్తామన్నారు.

Srikanth Reddy controversial comments on Chandrababu

ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం: గంటా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాస రావు ఢిల్లీలో స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. సెంట్రల్‌, ట్రైబల్‌ యూనివర్సిటీల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామన్నారు.

వచ్చే ఏడాది నుంచి గిరిజిన వర్సిటీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తామని మంత్రి గంటా చెప్పారు. విద్యారంగంలో దిశానిర్దేశానికి త్వరలో విశాఖలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందన్న గంటా తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే కౌన్సెలింగ్‌ ఆలస్యమైందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+