చంద్రబాబు వ్యాఖ్య: 'చెన్నై వరదల'తో తిప్పికొట్టిన శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్/గుంటూరు: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీగా వర్షాలు, వరదలు రావడంతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయని, దానిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరమని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
రెండేళ్లలో రాజధాని కోసం ఒక్క భవనాన్ని కూడా చంద్రబాబు నిర్మించలేదని ధ్వజమెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి జిల్లాల ప్రజల గొంతును కోస్తున్నారన్నారు.
మొబైల్ లైఫ్
ఏపీలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పైన శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, భూగర్భ జలాలు పెంచామని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.

చేతికి వాచీ ఉంటే అవినీతిపరులా?: అంబటి
చేతికి వాచీ, ఉంగరాలు ఉంటే అవినీతిపరులు అవుతారా అని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తన వేళ్లకు ఉంగరాల్లేవని, చేతికి వాచీ లేదని, అలాంటి తన పైన అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబు రెండు రోజుల క్రితం అభిప్రాయపడ్డారు.
దీనిపై అంబటి స్పందించారు. రాష్ట్రంలో దిగజారుతున్న తన పరువును నిలబెట్టుకోవాడనికే సీఎం చంద్రబాబు చవకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైసిపి నుంచి వలసలు అంటూ అనుకూల మీడియాతో కథనాలు గుప్పిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క కార్యకర్తను కూడా ఆకర్షించలేకపోయారన్నారు.
పట్టిసీమ, రాజధాని నిర్మాణం, శంకుస్థాపనల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో మరో దోపిడీకి నాంది పలికారని ధ్వజమెత్తారు.
చదరపు అడుగు బయట మార్కెట్లో రూ.1200 నుంచి రూ.1800 ఉంటే ప్రభుత్వం మాత్రం రూ.3350కు పైగా కాంట్రాక్టులు అప్పగించడం ఏమిటన్నారు. చంద్రబాబుకు ప్రజలు రానున్న కాలంలో బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications