వైసీపీలోకి ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్లు..!!

ఏపీలో ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. ఇటు పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ఈ రోజుతో శ్రీకాకుళం లో ముగియనుంది. రేపు పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సమయంలో శ్రీకాకులం జిల్లలోని మాజీ ఎమ్మెల్యే, కూటమి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పని చేయాలని వారికి జగన్ సూచించారు.

ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం చేరుకుంది. ఈ సాయంత్రం టెక్కలిలో జరిగే సభతో యాత్ర ముగియనుంది. 25న పులివెందులలో నామినేషన్, 26న మేనిఫెస్టో విడుదలకు జగన్ నిర్ణయించారు. ఆ వెంటనే రోజు మూడు సభల్లో పాల్గొనేలా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. సీఎం జగన్ తో శ్రీకాకుళంలోని కూటమి పార్టీల నేతలు పలువురు కలిసారు.పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Srikaulam Dist TDP alliance parties leaders joins in YCP in prsence of YS Jagan

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్వతీపురం నియోజకవ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హిళా క‌మిష‌న్ మాజీ స‌భ్యురాలు కొయ్యాన శ్రీ‌వాణి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆమెకు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+