తిరుమలలో చంద్రప్రభవాహనంపై నవనీత క్రిష్ణుడు, గోవిందా గోవిందా, భక్తుల కర్పూరహారతలు!
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాలు (brahmotsavam) రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరుసగా రెండుసార్లు తిరుమలలో (tirumala) బ్రహ్మోత్సవాలు వచ్చినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీకి తగ్గట్లు టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా ఏడో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై (Chandraprabha Vahanam) నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రప్రభ వాహనం - సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై (Chandraprabha Vahanam)స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల (tirumala) శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ (TTD) ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) ఏడవ రోజైన శనివారం రాత్రి చంద్రప్రభ వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ (TTD) హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలు, 441 మంది కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే కౌతమ్ అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వి.నాగలక్ష్మి బృందం డ్రమ్స్ విన్యాసాలతో, మరో బృందం శ్రీమణి ఆధ్వర్యంలో డంబుల్ నృత్యంతోను అలరించారు. బెంగుళూరుకు (Bengaluru) చెందిన ఇందు. బృందం గోవింద గోవింద యని కొలువరే అనే నృత్య ప్రదర్శన, శివాణి జోషి ఆధ్వర్యంలో దీపనృత్యాలతో కనువిందు చేశారు. మహారాష్ట్ర ముంబాయికి (Mumbai)చెందిన డాక్టర్ అనురాధశ ఆధ్వర్యంలో కథక్ నృత్య ప్రదర్శనతో అలరించారు.

తిరుపతికి చెందినమధువాణి, శ్రీనివాసులు, కృపావతి బృందాలు కోలాటాలతోను, డాక్టర్ మురళీ కృష్ణ బృందం జానపద నృత్యంతో అలరించారు. బెంగుళూరుకు (Bengaluru) చెందిన మేఘన బృందం వీరఘాస నృత్యంతో కనువిందు చేశారు. అనంతపురానికి చెందిన నగవర్షిని బృందం రాధాకృష్ణ రూపకంతోను, మైసూర్ (Mysuru) కు చెందిన ఆకాశ్ బృందం మైసూర్ నగరి అనే కళారూపంతోను, హుబ్లీకి చెందిన గౌరి బృందం సంపూర్ణ సుందరకాండతోను భక్తులను అలరించారు.












Click it and Unblock the Notifications