కెసిఆర్ అలా అన్లేదు: గౌడ్, మర్చిపోవద్దు: ఎపి గెజిటెడ్

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు నిలపాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని, దానర్థం సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లగొట్టడం కానే కాదని, ఉద్యోగులు ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాలని మాత్రమే చెబుతున్నామని, ఇప్పుడు ఎలాగూ రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి కాబట్టి, అటూ ఇటూ ఉద్యోగులు సహకరించుకోవాలని, తమ తమ రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, విడిపోవడంలోనే ప్రేమాభిమానాలు పెరుగుతాయని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని అందరికీ అదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించారని, ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అంకితం అయ్యారన్నారు. వారంతా ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ అంతే చురుగ్గా పాల్గొనాలన్నారు.
తెలంగాణ ఉద్యమమే లేకపోతే కొంతమంది ఉద్యోగులు బానిస బతుకులు బతకాల్సి వచ్చేదన్నారు. కొంతమంది సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేవిధంగా ఉన్న వీరి వైఖరి ఉందని, వారి మాటలు విని సీమాంధ్ర ఉద్యోగులు అయోమయానికి గురి కావొద్దని కోరారు.
రెచ్చగొడితే సహించం: గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
వారి చూరు పట్టుకుని వేళ్లాడాల్సిన ఖర్మ తమకేం లేదని, ఉద్యోగుల విషయంలో ఎంత హుందాగా వ్యవహరిస్తే అంత మంచిదని, రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించేది లేదని, విచ్ఛిన్నకర శక్తులతో కలిసి పని చేయాల్సిన అవసరం తమకు లేదని, తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 24 గంటలూ పని చేస్తామని, అవసరమైతే జీతాలను కూడా త్యాగం చేస్తామని, తామంతా కలిసి ఉన్నపుడు తాము ఇచ్చిన సహకారాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకులు విజయవాడలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications