శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈనెల 14వ తేదీ నుంచి డిసెంబరు 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెలవు రోజులు, పండగ రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం, దర్శనాలు కూడా వెంటనే కల్పించేందుకు దేవస్థానం అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు.
కార్తీక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు. శని, ఆదివారం, సోమవారాల్లో మల్లికార్జునస్వామిది అలంకార దర్శనమే ఉండనుంది. స్పర్శ దర్శనం టికెట్లను దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు.

శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని అధికారులు సూచించారు. 27వ తేదీన కార్తీక పౌర్ణమి కావడం.. 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారె సమర్పణతోపాటు జ్వాలాతోరణం నిర్వహించాలని నిర్ణయించారు.
కార్తీకమాసానికి సమానమైన మాసం లేదు.. సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదు. అలాగే వేదాలతో సమానమైన శాస్త్రమేదీ లేదు.. గంగానదికి సాటివచ్చే నది లేదు. కార్తీక మాసంలో ఆధ్యాత్మిక భావనతో, ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేదంటే నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రుళ్లు దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించడం, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చు.












Click it and Unblock the Notifications