16 గంటల పాటు శ్రీశైలం ఆలయంలో దర్శనాలు బంద్..

Srisailam Temple: ఈ నెల 7వ తేదీన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మూతపడనుంది. దాదాపుగా 16 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనున్నాయి. మహా ద్వారాలు బంద్ కానున్నాయి. మల్లన్నకు ఎటువంటి పూజలు గానీ, సేవలు గానీ అందుబాటులో ఉండవు. ఆర్జిత సేవలు, స్వామి- అమ్మవార్ల కల్యాణోత్సవాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. సాక్షిగణపతి, హాఠకేశ్వరం, పాలధార- పంచదార, శిఖరేశ్వరం తదితర పరివార ఆలయాలను కూడా మూసివేయనున్నారు అధికారులు.

ఆ రోజున చంద్రగ్రహణం కావడమే దీనికి కారణం. చంద్రగ్రహణం వల్ల మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయం మహా ద్వారాలను మూసివేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. మళ్లీ మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటలకు ద్వారాలను తెరుస్తారు. ఆలయశుద్ధి, మహా సంప్రోక్షణ జరిపించిన తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు.

Srisailam temple will remain closed in view of the upcoming lunar eclipse

చంద్రగ్రహణం 7న రాత్రి 9.56 గంటలకు ప్రారంభమౌతుంది. వేకువ జామున 1.26 నిమిషాలకు ముగుస్తుంది. ఈ కాలంలో ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు, పరోక్ష సేవలు, స్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలిపివేయనున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. భక్తులకు అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నట్లు చెప్పారు. మహా సంప్రోక్షణ అనంతరం 8వ తేదీన ఉదయం 7: 30 నుంచి స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులను జరిపించనున్నట్లు తెలిపారు.

ఆ సమయం నుంచి మధ్యాహ్నం 2:15 నిమిషాల వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని చెప్పారు. 8 నాటికి ఆన్‌లైన్‌లో స్వామివారి స్పర్శ దర్శనం, విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్పర్శ దర్శనాలు కల్పిస్తామని వివరించారు. తిరిగి సాయంకాలం 5:30 నుంచి రాత్రి 9 వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+