తిరుమలలో మంత్రి రోజాకు "అమరావతి" సెగ..!!

మంత్రి రోజాకు అనూహ్య ఘటన ఎదురైంది. తిరుమల వేదికగా అమరావతి నినాదాలు వినిపించాయి. మంత్రి రోజా శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు తిరుమల వచ్చారు. దర్శనం తరువాత తిరిగి ఆలయం బయటకు వచ్చిన సమయంలో శ్రీవారి సేవకులుగా ఉన్న కొందరు అమరావతి అనుకూల నినాదాలు చేసారు. చేశారు. జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. దీంతో షాక్ అయిన రోజా శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏపీలో ఎన్నికల వేళ తిరుమలలో అమరావతి అనుకూల నినాదాలతో మంత్రి రోజాను అడ్డుకొనే ప్రయత్నం జరిగింది. మంత్రి రోజా తరచూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంత్రి రోజా కు చేదు అనుభవం ఎదురైంది. స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద ''జై అమరావతి'' అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ మంత్రి రోజా వెళ్లిపోయారు.

Srivari Sevaks from Amaravati area demands Minister Roja to support for one Capital at Tirumala

అయితే, శ్రీవారి సేవకులుగా ఉంటూ ఆలయ సమీపంలో ఈ నినాదాల పైన అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. శ్రీవారి సేవకులుగా అమరావతి ప్రాంతానికి చెందిన వారు ఈ నినాదాలు చేసినట్లు చెబుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎన్నికల వేళ మూడు రాజధానుల వ్యవహారం రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, అనూహ్యంగా తిరుమల వేదికగా అమరావతి నినాదాలు చేయటంతో మరోసారి ఈ అంశం వివాదాస్పదంగా మారుతోంది. దీని పైన టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+