TTD:ఏకాంత సేవా సమయం కరువైన శ్రీవారు, అర్ద్రరాత్రి దాటినా- పండితుల ప్రతిపాదన..!!
Tirumala: తిరుమలలో శ్రీవారికి ఏకాంత సమయం తగ్గుతోంది. నిత్యం పెరుగుతున్న రద్దీతో శ్రీ వారికి ఏకాంత సమయం తగ్గటం పైన అర్చకులు.. పండితులు తాజాగా టీడీపీకి కీలక ప్రతిపాదన చేసారు. ఏకాంత సేవ సమయాన్ని పెంచాలని కోరుతున్నారు. రోజులో దాదాపు23 గంటలకు పైగా దర్శనాలు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవల పైనా చర్చ సాగుతోంది. దీంతో, శ్రీవారికి ఏకాంత సమయం పైన ఇప్పుడు మార్పుల దిశగా టీటీడీ కసరత్తు చేస్తోంది.
పెరిగిన రద్దీతో
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగడంతో శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకాంత సమయం తగ్గుతోంది. స్వామి కి కునుకు కరువవుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేదతీరే సమయం తగ్గి పోతోంది. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చక , పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తోంది. రోజూ వేకువజామున సుప్రభాత సేవతో స్వామి నివేదనలు మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజాము 2.30 గంటలకు మహద్వారం, వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటలలోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత పదేళ్లుగా ఈ సేవ నిర్వహణ సమయం అర్ధరాత్రి 1 నుంచి 2గంటల మధ్య సమయానికి మారిపోయింది.

అర్ద్రరాత్రి వేళ
కొన్నేళ్లుగా రాత్రి 2.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించి, ఆలయం తలుపులు మూస్తు న్నారు. ఒక్కోసారి 2.50 గంటలకు ఏకాంత సేవ పూర్తిచేసి, ఆ వెంటనే అంటే కేవలం 7 నిమి షాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. క్యూలైన్లు భారీగా ఉండి, కంపార్టుమెంట్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయించా లనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా క్యూలైన్లు కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితులు ఏర్పడిందని చెబుతున్నారు. రోజుకు 23 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇది సరికాదని, గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని కొందరు పండితులు ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మార్పు సాధ్యమేనా
ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని పురాణాల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనాల సమయాన్ని కుదించి ఏకాంత సమయాన్ని పెంచాలని అర్చకులు, కొందరు పండితులు టీటీడీ అధికారులను కోరినట్లు సమాచారం. అయితే, పెరుగుతున్న రద్దీ.. బ్రేక్ దర్శనాల ఒత్తిడి కారణం గా దర్శన సమయాలు ఎక్కువగా కేటాయించాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు స్వామి ఏకాంత సేవ కోసం వస్తున్న వినతులకు అనుగుణంగా టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications