విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో కాలేజీ స్థలం కబ్జా...కాపాడుకునేందుకు కదం తొక్కిన విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో విజయవాడలో భూ కబ్జాల పర్వం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన వైనం మరిచిపోకముందే ఇదే విజయవాడలో తాజాగా మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్‌, సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది.

దీంతో ఈ భూకబ్జాకు నిరసనగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కబ్జాకు గురైన స్థలంలో ప్రోక్లైన్లతో అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు అక్కడ ఉన్న బోర్డులు, జెండాలను పీకేశారు. టిడిపి నేత బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన ఈ భూమిని కూడా ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్పగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

SRR and CVR College Students Protest for College Lands

ఎన్టీఆర్ వంటి ఉద్దండులు చదివిన ఈ ప్రతిష్టాత్మక ఎస్.ఆర్.ఆర్.కాలేజీకి చెందిన సుమారు ఏడు ఎకరాల భూమిని కొందరు కబ్జా చేసారని వెలుగుచూసిన నేపథ్యంలో ఈ కళాశాల పూర్వ విద్యార్థులు రంగంలోకి దిగారు. తమ కాలేజీ స్థలాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించారు. కబ్జాకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో పూర్వ,ప్రస్తుత విద్యార్దులు తరలివచ్చిఆందోళనకు దిగారు. అక్కడ కట్టిన గోడను పడగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

కొద్ది రోజుల క్రితమే మంత్రి దేవినేని ఉమ కాలేజీ భూమి కబ్జాకు గురి కాదని చెప్పినా,అక్రమ నిర్మాణం కొనసాగుతుండటం పై విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొందరు అధికార పార్టీ నేతలే ఈ కబ్జా వెనుక ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చారని విద్యార్థి సంఘాలు, వామపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

English summary
Old students of the 81-year-old SRR & CVR Govt. College here on Tuesday stepped up agitation against encroachment of college land in the prime area adjacent to BRTS Road.Members of SRR & CVR Govt. College Alumni Association and student activists of the college staged protest on BRTS Road demanding that the government protect the land from the encroachers. Of the over 800 alumni members, about 100 turned up for the protest despite short notice and vowed to protect the college land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X