సవతి తల్లి చిత్రహింసలతో గాయాలపాలైన 4 ఏళ్ళ బాలుడు
ప్రకాశం :అమ్మను మించిన దైవం ఉండదంటారు. కాని, ఓ సవతి తల్లి 4 ఏళ్ళ బాలుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఒంటినిండా వాతలు పెట్టి తన కసితీర్చుకొన్నారు.చిన్న పిల్లాడని కూడ చూడకుండా చిత్ర హింసలు పెట్టారు.
ప్రకాశం జిల్లా దర్శిలో నాలుగేళ్ళ బ్రహ్మయ్య అనే బాలుడిని సవతి తల్లి చిత్రహింసలు పెట్టింది.మాట వినలేదనే అక్కసుతోనే సవతి తల్లి ఈ దురాగతానికి పాల్పడింది.
బ్రహ్మయ్య తండ్రి ఆంజనేయులు రెండో వివాహం చేసుకొన్నాడు. తండ్రి వద్దే బ్రహ్మయ్య ఉంటున్నాడు. బ్రహ్మయ్య తమతో ఉండడం ఇష్టం లేని ఆంజనేయులు రెండో భార్య లక్ష్మీ బ్రహ్మయ్యను చిత్రహింసలు పెట్టింది.

మాట వినలేదని బ్రహ్మయ్యను చితకబాదింది లక్ష్మీ. అంతేకాకుండా ఓ గదిలో బందించింది.ఆమె కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డారు.ఆమె నుండి ఎలాగోలా తప్పించుకొన్న బ్రహ్మయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులను బ్రహ్మయ్యకు చికిత్స చేస్తున్నారు.బ్రహ్మయ్యను అంగన్ వాడీ కార్యకర్తలు సంరక్షిస్తున్నారు. సవతి తల్లి లక్ష్మీ, తండ్రి ఆంజనేయులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications