Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ నడిచేదెలా - కొత్త టెన్షన్..!?

తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందేభారత్ విషయంలో అధికారులకు ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది.

వందేభారత్ రైళ్లపై ఆసక్తి పెరుగుతోంది. త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టేందుకు రైల్వే శాఖ సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రారంభమైన విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ కు ఆక్యుపెన్సీ రేషియో బాగుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా వందేభారత్ తో పాటుగా వందేమెట్రో పైన రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. వందేభారత్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నా..ఆదరణ ఉండటంతో రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని సర్వీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఈ సమస్య పైన రైల్వే అధికారులు కసరత్తు ప్రారంభించారు.

వందేభారత్ కు పెరుగుతున్న ఆదరణ

వందేభారత్ కు పెరుగుతున్న ఆదరణ

ఈ ఏడాది సంక్రాంతి రోజన ప్రధాని మోదీ వర్చ్చువల్ విధానంలో తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ప్రారంభించారు. ప్రారంభం సమయంలో విమర్శలు వచ్చినా..ఆ తరువాత ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి మరో మూడు కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్వయంగా రైల్వే మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారులు రూట్లను ఖరారు చేస్తూ నివేదికలు ఇచ్చారు. కాచిగూడ - బెంగుళూరు, సికింద్రాబాద్ - పూణే, సికిద్రాబాద్ - తిరుపతి మధ్య మూడు రైళ్లకు ఆమోదం కూడా లభించింది. వీటిల్లో ముందుగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను త్వరలోనే పట్టలెక్కించేలా కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే ట్రయిల్ రన్ కూడా పూర్తి చేసారు.

వరుసగా రాళ్ల దాడులు

వరుసగా రాళ్ల దాడులు


ఈ సమయంలో రైల్వే అధికారులకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమస్యగా మారుతున్నాయి. దీని వెనుక అసలు కారణం పైన ఫోకస్ చేసారు.వందే భారత్ రైలు విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వేళ ప్రారంభమైన రోజుల్లో విశాఖ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. దాడిని చేసిన వారిని వెంటనే పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో సారి ఇదే తరహాలో వందేభారత్ పైన దాడి జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రైలు కోచ్‌ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అధికారుల అప్రమత్తం

అధికారుల అప్రమత్తం


దుండగుల్ని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు తెలిపారు. దీంతో..రైలు రాకపోకల పైన ప్రభావం పడింది. రైలు నడిచే సమయాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా రైలుప్రయాణం ఆలస్యం అయింది. ఇలా వందేభారత్ రైలు పైనే ఇలా దాడులు చేయటం వెనుక అసలు కారణాలు ఏంటనేది అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో..రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. ప్రభుత్వ రైల్వే పోలీసులు ఈ దాడుల కారణాలను విశ్లేషించటంతో పాటుగా భవిష్యత్ లో జరగకుండా జాగత్రలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దాడులతో ప్రయాణీకుల్లో ఆందోళన తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+