విడదల రజనికి ఉచ్చు - కీలక పరిణామం..!!
మాజీ మంత్రి విడదల రజనీ పై హోం మంత్రికి ఫిర్యాదులు అందాయి. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజనీ తమను వేధించి అక్రమంగా వసూళ్లు చేసారంటూ స్టోన్ క్రషర్ ఫిర్యాదు చేసారు. తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోం మంత్రి అనిత... విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. గతంలోనూ రజనీ పైన పలు ఆరోపణలు ఉన్నాయి.
రజనీ పై ఫిర్యాదులు
మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజినీపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. విడుదల రజినీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. విడుదల రజినీ అక్రమాలపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజినీ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజినీ పిఏ గోపి కలిసి 2.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పల్నాడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బెదిరించారు
ఈ విషయం బయటకు పొక్కినా, ఫిర్యాదు చేసినా వ్యాపారం చేయలేరని, ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ, నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు. బెదరించి, భయపెట్టి వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు. దీని పైన హోం మంత్రి పూర్తి స్థాయి సమాచారం కోరినట్లు సమాచారం.
వసూళ్లు చేసారంటూ
గతంలోనూ రజనీ పైన ఫిర్యాదులు ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలకగా జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ మంత్రి రజిని రైతులకు ఎరవేశారని ఆరోపణలు ఉన్నాయి. మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున కోటీ 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.
మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications