చంద్రబాబు వాహనం పై రాళ్ల దాడి - భదతాధికారికి గాయాలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కాన్వాయ్ పైన అగంతకుడు రాయి విసరటం తో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతున్న సమయంలో రాయి విసరటంతో భదత్రాధికారి మధుకు గాయాలయ్యాయి. ఈ దాడి పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డీ..పులివెందుల రాజకీయం చేయవద్దంటూ చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ రౌడీలకు భయపడేది లేదని చెప్పారు. పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసారు. పోలీసుల భద్రత సరిగ్గా లేదంటూ ఆగ్రహించారు. జగన్ నీ ఆటలు సాగవ్.. అంటూ టీడీపీ అధినేత ఫైర్ అయ్యారు. ఏపీ భవిష్యత్తు టీడీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. నవరత్నాల పేరుతో నవద్రోహాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలులో పార్టీ మహానాడు పెడితే బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అయినా, కట్టలు తెంచుకొని పార్టీ అభిమానులు తరలి వచ్చారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నందిగామలో స్పందన కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నలభై ఏళ్ల కాలంలో తొలి సారిగా ఈ స్పందన వచ్చిందని చెప్పారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కొండలు కరిగించేస్తున్నారని ఆరోపించారు. ఉచితంగా తాము ఇసుకు ఇస్తే, ఇప్పుడు ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నకిలీ మద్యం ధరలు పెంచి కోట్లాది రూపాయాలు దండుకుంటున్నారంటూ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, ధరలు తక్కువ ధరలు ఉంటే..ఏపీలో మాత్రం అధిక ధరలు ఉన్నాయని విమర్శించారు. అన్నింటి ధరలు పెంచేసారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. గాయపడిన మధుబాబుకు ప్రాధమిక చికిత్స చేసారు. జగ్గయ్య పేటలోనూ చంద్రబాబు రోడ్ షో కొనసాగనుంది.












Click it and Unblock the Notifications