ఏం జరిగింది: కొడుకు చనిపోయాడు, తల్లిదండ్రులు ఉరేసుకొన్నారు

కొడుకు మరణించడాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకొంది. జ్వరంతోనే కొడుకు స్కూల్ లోనే చనిపోయాడు.

గుంటూరు :అల్లారుముద్దుగా పెంచుకొన్న కొడుకు మరణించడంతో తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు పట్టణంలోని పట్టాభిపురానికి చెందిన చంద్రశేఖర్ ,నవీన దంపతుల కుమారుడు వంశీ ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నాడు. అయితే జ్వరంతో వంశీ పాఠశాలలోనే చనిపోయాడు. వంశీ చనిపోయిన తర్వాత ఆలస్యంగా తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

student died at school with fever, his parents sucide in home

అయితే ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కొడుకు తమతో గడిపిన ఘటనలను గుర్తు చేసుకొంటూ ఉండిపోయారు. ఈ అనుభూతులు వారిని తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి.

ఒక్క కొడుకు కూడ మరణించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తల్లిదంద్రులు ఉరేసుకొని చనిపోయారు. ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది. అయితే ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విధ్యార్థి మరణానికి, తల్లిదండ్రుల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని విధ్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+