Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంగ్లీష్ మీడియంతో మొద్దబ్బాయిలే-చంద్రబాబు హెచ్చరిక-జై జగన్ నినాదాలతో పేరెంట్స్ కౌంటర్

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుకు సిద్దమైన ఇంగ్లీష్ మీడియానికి కోర్టుల్లో ఇంకా అనుమతి లభించలేదు. అయితే ఆ లోపే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు నిరసనగా చంద్రబాబు తల్లితండ్రులకు తాజాగా ఓ సూచన చేశారు. దీనిపై వారు అక్కడికక్కడే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

 ఇంగ్లీష్ మీడియం అమలు

ఇంగ్లీష్ మీడియం అమలు

ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. తొలుత ఇంగ్లీష్ మీడియం అమలుకు నిర్ణయం తీసుకోగానే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై విద్యార్ధుల తల్లితండ్రుల ఆమోదం తీసుకున్న ప్రభుత్వం.. తమ నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. దీనిపైనా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో తుది తీర్పు కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆలోపే ఇంగ్లీష్ మీడియం అమలుకు వీలుగా స్కూళ్లలో చర్యల్ని వేగంగా తీసుకుంటోంది. దీంతో ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రతిష్టంభన నెలకొంది.

చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ఏపీలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమలును ముందునుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా జిల్లాల పర్యటనలో భాగంగా విద్యార్ధుల తల్లితండ్రులతో సమావేశమయ్యారు. అక్కడ విద్యార్ధుల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. విద్యార్ధుల తల్లితండ్రులతో భేటీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అక్కడే కౌంటర్లు పడటంతో చంద్రబాబు కాసేపు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

మొద్దబ్బాయిలవుతారంటూ

మొద్దబ్బాయిలవుతారంటూ


రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చంద్రబాబు తల్లితండ్రుల వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను ఇంగ్లీష్ నేర్పిస్తానన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది. దీని వల్ల మన పిల్లలంతా మొద్దబ్బాయిలుగా తయారవుతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాల్నిసైతం వారికి గుర్తు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తల్లితండ్రులు ఆయనకు షాకిచ్చారు.

 జై జగన్ నినాదాలతో కౌంటర్

జై జగన్ నినాదాలతో కౌంటర్

చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం అమలు వల్ల కలిగే దుష్ప్రరిణామాల్ని వివరించేందుకు ప్రయత్నిస్తుండగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ గుమికూడిన తల్లితండ్రుల్లో కొందరు జై జగన్ నినాదాలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వారు జై జగన్ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినావారు వినకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+