జగన్‌కు విజ్ఞప్తి, ఎమ్మెల్యేపై కేసు నమోదు
హైదరాబాద్: పేద విద్యార్ధుల ప్రయోజనాలకు నష్టం కలిగించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లను చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావాలని చూస్తోందని, అసెంబ్లీలో ఆ బిల్లుని వ్యతిరేకించాలని ఐదు విద్యార్ధి సంఘాలతో కూడిన ఐక్యవేదిక వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వినతిపత్రాన్ని సమర్పించాయి.
దీనిపై స్పందించిన వైయస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ యూనివర్శిటీలను అంగీకరించమని అన్నారు. పేదలకు విద్యను దూరం చేసే ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోందని జగన్ కు తెలిపారు.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
విద్యుత్ సబ్ స్టేషన్‌లోకి అక్రమంగా చొరబడటమే కాక అక్కడి సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు నియోజకవర్గ పరిధిలోని యాదమరి ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
యాదమరి మండలం మోర్గానపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లోకి ప్రవేశించిన సునీల్ కుమార్, అక్కడ పనిచేస్తున్న ఆపరేటర్‌ను బెదించారని ఫిర్యాదు అందిందన్నారు. దీంతో ఎమ్మెల్యేపై 148, 348, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.












Click it and Unblock the Notifications