సీఎం జగన్ కార్యాలయంలో శాఖల మార్పు - కేటాయింపులు ఇలా..!!
రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులకు శాఖలు కేటాయించారు. కొద్ది రోజుల క్రితం వరకు సీఎంఓ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాశ్ ను ఢిల్లీకి బదిలీ చేసారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. ఆ స్థానంలో టీటీడీ ఈవోగా వ్యవహరిస్తూ... ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అధికారి జవహర్ రెడ్డిని సీఎంలో ముఖ్య ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగనున్నారు.

జవహర్ రెడ్డికి కీలక బాధ్యతలు
అనేక కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉన్న జవహర్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సీఎస్ గా కొనసాగుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు సీఎంఓ లో స్పెషల్ సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి కి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్సబ్జెక్టులు కేటాయించారు. ఆ తరువాత మరో అధికారి సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్‌కు పౌరసరఫరాలు, విద్యా, పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, అన్ని సంక్షేమ శాఖలు కేటాయిస్తూ నిర్ణయించారు.

సీఎంఓ ప్రధాన భూమిక
సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంథన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలుపర్యవేక్షించనున్నారు. సీఎం అడిషనల్ సెక్రెటరీ ముత్యాలరాజుకు ప్రజా ప్రతినిధుల వినతులు, రెవెన్యూ (ల్యాండ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్),హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్ మెంట్శాఖలు కేటాయింపు జరిగింది. ఇక, పాలనా పరంగానూ పలు శాఖల ముఖ్య కార్యదర్శులను మారుస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు వెలు వడ్డాయి. ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Recommended Video

మూడేళ్ల పాలన పూర్తవుతున్న వేళ..
దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా సీనియర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..త్వరలో జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీల బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఇక, పాలనా పరంగానూ కీలక మార్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ పూర్తవుతూనే... మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సీఎం జగన్.. పాలనలో కీలక నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు.












Click it and Unblock the Notifications