కాకినాడ జిల్లా ఉప్పాడలో బాంబు కలకలం-పేలుడు ధాటికి విరిగిపడ్డ వ్యక్తి చేయి

ఏపీలోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఇవాళ బాంబు పేలుడు కలకలం రేగింది.
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలోని ఓ బోటు రిపేర్ షెడ్డులో పేలుడు చోటుచేసుకోవడంతో గ్రామ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉప్పాడ సమీపంలోని అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు సమీపంలో బోట్లు రిపేర్ యూనిట్ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. కాలువ పక్కనే బోట్లు నిలిపి రిపేర్ చేసుకునే షెడ్ వద్ద రోడ్డు పక్కన తుప్పలు తొలగించి దారి ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో బడే ఏసు దాసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి ఏసుదాసు చేయి మణికట్టు తునాతునకలై దూరంగా పడింది. దీంతో వెంటనే స్పందించిన స్ధానికులు పోలీసుల సాయంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

 sudden explosion in boat repair shed in uppada of kakinda district-one man injured

బోటు రిపేర్ షెడ్డులో ఒక్కసారిగా భారీ పేలుడు రావటంతో స్ధానికులు బాంబుపేలుడుగా దీన్ని భావిస్తున్నారు. అయితే పేలుడుకు కారణం ఏంటేనేది ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు కారణాలు నిర్ధారించేందుకు నిపుణులతో పాటు క్లూస్ టీమ్ ను రప్పిస్తున్నారు. మత్సకారులతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకోవడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బాంబు పెట్టారా లేక పాత సామాగ్రి కెమికల్ మిక్స్ అయి పేలుడు సంభవించిందా అన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+