30 కోట్ల అకౌంట్లలో రూ.9330 కోట్లు..! కేంద్రానిదే బాధ్యతన్న సాయిరెడ్డి..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అన్నీ తానై వ్యవహరించిన వారిలో ఒకరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకొంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత రూటుమార్చి తిరిగి యాక్టివ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ఎక్స్ లో యాక్టివ్ గా ట్వీట్లు పెడుతున్న సాయిరెడ్డి.. ఇదే క్రమంలో తాజాగా ఓ కీలకమైన అంశంపై కేంద్రం జోక్యం కోరారు.

మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!
మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!

ఉద్యోగులు తమ జీవితకాలం దాచుకున్న పీఎఫ్ (PF)డబ్బుల్ని కొన్ని సార్లు అలాగే వదిచేసి చనిపోవడమో, లేక పట్టించుకోకుండా వదిలేయడమో చేస్తున్నారు. అలాంటి అకౌంట్లు ఇన్ యాక్టివ్ గా మారిపోతున్నాయి. అలాగే వాటిలో కోట్లాది రూపాయల డబ్బు అలాగే ఉండిపోతోంది. ఈ మొత్తం తాజాగా లెక్కిస్తే 30.9 ఇనాక్టివ్ అకౌంట్లలో రూ.9330 కోట్లు ఉన్నట్లుగా తేలింది. దీన్ని సదరు పీఎఫ్ ఖాతాదారులు త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీనిపై సాయిరెడ్డి స్పందించారు.

Vijayasai Reddy Urges Centre to Act on 9 330 Crore Lying Unclaimed in 30 9 Lakh EPF Accounts
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్..!

కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన ₹9,330 కోట్లు 30.9 లక్షల నిష్క్రియాత్మక ఈపీఎఫ్ ఖాతాలలో నిలిచిపోయాయని, పత్రాల పని కారణంగానో, లేదా చట్టబద్ధమైన వారసులకు ఈ ప్రక్రియ గురించి తెలియకపోవడం లేదా పూర్తి చేయలేకపోవడం వల్లనో ఈ సొమ్ము ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిందని తాను ఖచ్చితంగా చెప్పగలనని సాయిరెడ్డి తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో లబ్ధిదారులను చురుకుగా గుర్తించి, సంప్రదించి, సహాయం చేయమని ఆయన కోరారు. ఈ మేరకు తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజల డబ్బును తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉండాలి, దాని కోసం పౌరులు వెంటపడాల్సిన అవసరం లేదంటూ చివరిగా ఓ చురక అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+