సింహాచలంలో సుజన, నష్టం జరిగితే ఊరుకోమని..
విశాఖ: కేంద్రమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సుజనా చౌదరి ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్సించుకున్నారు. అధికాలులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పండితులు ఆయనకువేదాశీర్వచనం ఇచ్చారు.
రాష్ట్రానికి నష్టం జరిగితే ఊరుకోం
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుందని సుజనా చౌదరి శనివారం నాడు పేర్కొన్నారు. నాలుగు రోజులు అటుఇటు అవుతుంది తప్ప ప్రతిదీ వస్తుందన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.

ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా వచ్చిన నీతిఆయోగ్ తొలి సమావేశం ఫిబ్రవరి 8న ప్రధాని అధ్యక్షతన జరగనున్నదన్నారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రాష్ట్రానికి రావలసిన నిధులపై మాట్లాడతారన్నారు. నిధుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
విభజన చట్టంలో చెప్పిన, ఇంకా చెప్పని అంశాలకు సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు రాబడతామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎస్ఐఆర్ పరిధిలో తొలి ప్రాంతీయ లేబొరేటరీ విశాఖలోనే ఏర్పాటవుతుందన్నారు. కొత్త రాష్ట్రంలో సీఎస్ఐఆర్ పరిధిలో వున్న ఒకే ఒక కేంద్రం విశాఖ ఎన్‌ఐవో అని పేర్కొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు వున్నాయన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని చంద్రబాబు హుధుద్ తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం అతి తక్కువగా వుండేలా సమర్థంగా పని చేశారన్నారు. దేశంలో సైన్స్ సిటీలు, సైన్స్ పార్కుల ఏర్పాటుకు బ్లూప్రింట్ తయారు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications