కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్ర కక్షపూరితం! ఐటీ దాడులకు భయపడేది లేదు: కడప స్టీల్‌ప్లాంట్‌పై సుజనా చౌదరి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఏపీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తోందని సుజనాచౌదరి ఆరోపించారు.

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం మెకాన్‌ సంస్థకు ఇవ్వలేదంటూ కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్‌ ప్రకటించటం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికి ఏడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం మెకాన్‌కు సమగ్ర సమాచారం ఇచ్చిందన్నారు.

sujana chowdary fires at central government for steel plant issue

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాలనే కేంద్రం ఆటంకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తోందని సుజనా విమర్శించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కేంద్రం ఏపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రైల్వే జోన్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఐటీ దాడులతో భయపడేది లేదని సుజనా వ్యాఖ్యానించారు. బీజేపీ చర్యల వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లేలా ఉందని వ్యాఖ్యానించారు.

English summary
TDP MP Sujana Chowdary fired at Central Government for steel plant issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X