వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్, బెయల్ రద్దు చెయ్యండి, సుప్రీంలో !!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టుకు మనవి చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్లు అన్నీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని సునీత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు మనవి చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాఖలు అయిన పిటిషన్లు అన్నీ కలిపి నవంబర్ 5వ తేదీ ఒకేసారి విచారణ చేపట్టనున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లు అన్నీ ఒకేసారి విచారణ చేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ జయ్ కుమార్ ల ధర్మాసనం అంగీకారం తెలిపింది. వైయస్. వివేకానంద హత్య కేసులో సొంత సోదరుడు వైఎస్ జగన్ సీఎం గా ఉన్నాకూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని చాలా కాలం నుంచి సునీత ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ కేసు నుండి తప్పుకోవాలని చాలామంది తనను బెదిరించారని వైయస్ వివేకానంద కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని, ఆ పార్టీ నాయకులు అందరిని ఓడించాలని కొన్ని జిల్లాలలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సునీత టీడీపీకి అమ్ముడుపోయారని కొంత మంది వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆరోపించారు.
అయితే తాను ఏ పార్టీకి అమ్ముడు పోలేదని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని సునీత వైసీపీ నాయకుల ఆరోపణలను తిప్పికొట్టారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిసిన వైయస్ వివేకానంద కుమార్తె సునీత వరద బాధితులకు సహాయం కోసం సీఎం రీలిఫ్ ఫండ్ ఇచ్చారు. సొంత సోదరుడు జగన్ పై నమ్మకం లేదని, జగన్ మాకు ఏమాత్రం న్యాయం చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వైయస్ షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications