‘బాబు’ను చించేశా! దమ్ముంటే నాపై దాడి చెయ్: చింతమనేనికి పద్మశ్రీ సవాల్
విజయవాడ: దమ్ము, ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న సీఎం చంద్రబాబునాయుడి పోస్టర్‌ను బుధవారం ఆమె చించేశారు.
అనంతరం పద్మశ్రీ మాట్లాడుతూ.. తాను చంద్రబాబు పోస్టర్‌ను చించేశానని, హనుమాన్ జంక్షన్‌కి వచ్చి తనపై దాడి చేయాలంటూ చింతమనేనికి సవాల్ విసిరారు. చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. దాడి చేసిన చింతమనేనిని వదిలిపెట్టి.. సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తారా? అని పోలీసులను పశ్నించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని సుంకర పద్మశ్రీ అన్నారు.
ఓ బస్సుకు అతికించిన పోస్టర్‌లో చంద్రబాబు ముఖం చించివేసి ఉండటాన్ని చూసిన చింతమనేని ప్రభాకర్.. ఆ బస్సు డ్రైవర్, కండకర్టర్‌లను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేగాక, వారించేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.












Click it and Unblock the Notifications