మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి(70) వేకువజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని ఇంట్లో కన్నుమూశారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిచెందిన వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పెద్దకుమారుడు రమేష్‌బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు తల్లి మృతితో కృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 00 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచుతారు. అనంతరం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలోనే విజయ నిర్మల, రమేష్ బాబు మృతితో విషాదంలో ఉన్న మహేష్ బాబు కుటుంబానికి ఆమె తల్లి కూడా మృతిచెందడం తీరనిలోటుగా మారింది.












Click it and Unblock the Notifications