మహేష్ బాబు రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్?
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. తమన్ స్వరాలందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. మొదట పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ ఆమె రూ.4కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుండటంతో ఆమె స్థానంలో తాజా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు జీఎస్టీతో కలిపి ఈ సినిమాకు రూ.78కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదంటూ ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. రూ.200 కోట్ల బడ్జెట్ తో గుంటూరు కారం రూపుదిద్దుకుంటోంది. 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నైజాం ప్రాంతానికి రూ.45 కోట్లు, సీడెడ్ రూ.20 కోట్లు, ఆంధ్రలో రూ.50 కోట్ల రేంజ్ లో వ్యాపారం జరగనుందని తెలుస్తోంది. ఆడియో రైట్స్ కు రూ.5 కోట్లు, దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కు రూ.100 కోట్లు కోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ తోపాటు డిజిటల్ రైట్స్ కూడా రూ.30 కోట్ల రేంజ్ లో ఉంటోందని తెలుస్తోంది.

బ్రహ్మానందం కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనపడనున్నారు. సెలెక్టివ్ గా సినిమాలను చేసుకుంటూ వస్తోన్న బ్రహ్మానందం ఇందులో నటించడం ప్లస్ పాయింట్ లాంటిది. జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా రమ్యకృష్ణ, రఘుబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications