Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: ఏబీ వెంకటేశ్వర రావును ఎలా మోసుకెళ్లారో చూస్తారా?

AB Venkateswara Rao: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ రోజే ఆయనకు పోస్టింగ్ లభించింది. ఈ ఉదయం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రానికి పదవీ విరమణ చేశారు.

1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఏపీకి కేటాయించింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. 2014- 2019 మధ్యకాలంలో ఏపీలో పలు కీలక విభాగాల్లో పని చేశారు. సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు.

Supporters greets AB Venkateswara Rao after his retirement

ఆ సమయంలో ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఆ తరువాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలుమార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన సెంటర్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ సైతం ఏబీవీ సస్పెన్షన్‌ను సమర్థించడంతో హైకోర్టులో న్యాయపోరాటం చేశారు.

ఎట్టకేలకు ఆయన సస్పెన్షన్‌ను తొలగిస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పోస్టింగ్ లభించింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డైరెక్టర్ జనరల్‌గా ఆయనను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి.

ఈ ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మద్దతుదారులు ఏబీ వెంకటేశ్వరరావును సన్మానించారు. కార్యాలయంలోని ఆయన ఛాంబర్ నుంచి సన్మాన వేదిక వరకు భుజాలపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు.

పూలు చల్లుతూ లాంగ్ లీవ్, లాంగ్ లీవ్.. ఏబీవీ లాంగ్ లీవ్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. తదితరులు ఏబీవీకి విషెస్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+