తండ్రి న్యాయవాది..కుమారుడు న్యాయమూర్తి: సుప్రీంలో మూడు రాజధానుల బిల్లు మరో బెంచ్‌కు బదిలీ

న్యూఢిల్లీ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు మరోసారి వాయిదా పడింది. ఈ రెండు బిల్లులు మరో బెంచ్‌కు బదిలీ అయ్యాయి. ఈ రెండు బిల్లులు వేరే బెంచ్‌కు బదిలీ కావడం ఇది రెండోసారి. ఇదివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి వచ్చిన ఈ బిల్లు జస్టిస్ రోహన్టన్ ఫాలీ నారీమన్ బదిలీ అయింది. తాజాగా మరోసారి ఇది బదిలీ మరో బెంచ్‌కు బదిలీ అయింది.

అమరావతి ప్రాంత రైతుల తరఫున మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ అరవింద్ కుమార్తె ఈ కేసును వాదిస్తున్నారు. తండ్రి న్యాయమూర్తిగా ఉన్న బెంచ్ సమక్షంలో కుమార్తె న్యాయవాదిగా మూడు రాజధానుల వంటి కీలకమైన బిల్లును వాదించడం సరికాదంటూ అడ్వొకేట్ రంజిత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఈ రెండు బిల్లులపై విచారణను నారీమన్ బెంచ్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు అప్పట్లో ఎస్ఏ బొబ్డే రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా బుధవారం ఈ కేసు నారీమన్ బెంచ్ సమక్షానికి విచారణకు వచ్చింది.

Supreme Court adjourns hearing on three capital, CRDA repeal Bills

ఈ బెంచ్‌లో కూడా అదే తరహా పరిణామాలు ఎదురయ్యాయి. అమరావతి రైతుల తరఫున కేసును వాదిస్తోన్న సీనియర్ అడ్వొకేట్ ఫాలీ శామ్ నారీమన్ కుమారుడు రోహిన్టన్ ఫాలీ నారీమన్ న్యాయమూర్తిగా బెంచ్‌లో ఉన్నారు. మూడు రాజధానుల బిల్లు విచారణను చేపట్టిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రోహిన్టన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తండ్రి ఫాలీ శామ్ నారీమన్.. ఈ కేసును అమరావతి రైతుల తరఫున వాదిస్తున్నారు. దీనితో మరోసారి ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా మరో బెంచ్‌కు బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+