వైసీపీ నేతలకు సుప్రీంలో బిగ్ రిలీఫ్..!!
వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ ముఖ్య నేతల పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసారు. ఇతర నేతలు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కోర్టు వీరి అభ్యర్ధన తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవటంతో...వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ కార్యాలయం పై దాడి వెనుక వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ తో పాటుగా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేసారు. వీరి అనుచరులు పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసానికి కారణమయ్యారనే ఫిర్యాదులతో ఈ కేసు నమోదు చేసారు. దీంతో, ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ అనంతరం వైసీపీ నేతల అభ్యర్ధనను తిరస్కరించారు.

దీంతో, ఈ నేతల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేసారు. ఇటు ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేయగా..ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇక..విచారణ తరువాత సుప్రీంకోర్టు కండీషన్లతో నందిగం సురేశ్ తో సహా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు సహకరించాలని సూచించింది. పాస్ పోర్టు లు అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. ఈ కేసును నవంబర్ 4కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications