డిసెంబర్ 15 కల్లా హైకోర్టు నిర్మాణం: సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫోటోలు అడిగిన కేంద్రం
హైదరాబాద్: హైకోర్టు విభజనకు సుప్రీం కోర్టు సోమవారం సానుకూలత తెలిపింది. డిసెంబర్ 15వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అప్పటికల్లా అమరావతిలో తాత్కాలిక కోర్టు భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం అఫిడివిట్ దాఖలు చేసింది.
ఏప్రిల్ నాటికి స్టాప్ క్వార్టర్స్, జడ్జిల నివాసాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిందని ఏపీ తరఫు లాయర్ నారీమన్ వెల్లడించారు. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కోర్టుకు సమర్పించింది.
హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబర్ 15వ తేదీ లోగా పూర్తవుతుందని తెలిపింది. కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ లాయర్ వేణుగోపాల్ ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications