వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై జగన్ సిట్ దర్యాప్తు- సమర్దిస్తూ సుప్రీం వ్యాఖ్యలు-టెన్షన్ ఎందుకన్న కోర్టు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో టీడీపీ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలను తిరగతోడాలని నిర్ణయించింది. వాటిలో తప్పుల్ని కనిపెట్టేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ దర్యాప్తు చేస్తుండగానే హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు నిన్న దీన్నిపూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే సుప్రీం విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి..

చంద్రబాబుపై జగన్ సిట్

చంద్రబాబుపై జగన్ సిట్

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను తప్పుబడుతూ వాటి సంగతి తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జగన్ సర్కార్ దాన్ని సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్లు అయిన టీడీపీ నేతలు వర్లరామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే వాదించారు. ఆయన పలు విషయాల్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. వీటిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం మారితే వేధింపుల వేటా ?

ప్రభుత్వం మారితే వేధింపుల వేటా ?


ఈ కేసులో టీడీపీ నేతల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే పలు విషయాల్ని సుప్రీంకోర్టు ముందుంచారు. సిట్ అధికారి కూర్చున్నదే పోలీస్ స్టేషన్ అని ఇచ్చిన ఉత్తర్వులు, నిజనిర్ధారణ బృందంలో అంతా ఒకే పార్టీకి చెందిన వారుండటాన్ని ప్రశ్నించారు. వారికి బదులు ఓ రిటైర్డ్ జస్టిస్ ను పెడితే అభ్యంతరాలు ఉండేవి కావన్నారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రత్యర్ధి పార్టీలు గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగతోడుతూ విచారణల పేరిట వేధించడం సరికాదని వాదించారు. ఇలా అనుమతిస్తే ప్రతీ రాష్ట్రంలోనూ ఇలాగే వేధింపుల వేట కొనసాగుతుందన్నారు.

టెన్షన్ ఎందుకున్న సుప్రీంకోర్టు ?

టెన్షన్ ఎందుకున్న సుప్రీంకోర్టు ?

టీడీపీ నేతల న్యాయవాది వాదనలపై స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా.. గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశీలించకూడదా ? వాళ్లేం చేసినా కాపాడాలా ? ఇది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నలు వేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం సీబీఐకి చేసిన విజ్ఞప్తిని కేంద్ర దర్యాప్తు సంస్ధ పట్టించుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ చేసిన వాదనను కూడా న్యాయమూర్తి అంగీకరించలేదు. సీబీఐ ఇందులో ఏ నిర్ణయమూ తీసుకోకుండానే మీరెలా ఊహాగానాలు చేస్తారంటూ న్యాయవాదిని ప్రశ్నించారు. పాలనా మార్పు తర్వాత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్షపాతానికి అవకాశం కల్పిస్తాయని గతంలో జస్టిస్ ఖన్నా ఇచ్చిన తీర్పును టీడీపీ న్యాయవాది ప్రస్తావించినప్పుడు.. అప్పుడు కోర్టుల్లో సవాల్ చేయొచ్చుగా అంటూ జస్టిస్ సుంద్రేశ్ ప్రశ్నించారు. అలాగే అంతా చీకట్లో వెతుకుతున్నారని, విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయని జస్టిస్ షా తెలిపారు.

English summary
supreme court has made key remarks on tdp's objections over sit inquiry against chandrababu regime decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X