సదావర్తి కేసులో మరో ట్విస్ట్, ఆళ్లకు ఝలక్: కళ్లు మూసుకోలేమని సుప్రీం ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/అమరావతి: సదావర్తి భూముల వ్యవహారంలో మరో ట్విస్ట్. ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.

నంద్యాల ఎఫెక్ట్: కెసిఆర్ పాత అస్త్రం, ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు

ఈ నెల 14న భూములను వేలం వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములను తక్కువ ధరకే అప్పనంగా సొంతం చేసుకున్నారన్న అనుమానం తమకు ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది.

కళ్లు మూసుకొని కూర్చోలేం

కళ్లు మూసుకొని కూర్చోలేం

మోసం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కళ్లు మూసుకొని కూర్చోలేమని పేర్కొంది. అంతేకాదు, వేలంలో పిటిషనర్ కూడా పాల్గొనాలని తెలిపింది.

సంజీవరెడ్డి పిటిషన్

సంజీవరెడ్డి పిటిషన్

ఈ భూముల వేలం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని సంజీవ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు వెలువరించింది.

చౌకగా కొట్టేసేందుకు ప్రయత్నం

చౌకగా కొట్టేసేందుకు ప్రయత్నం

తొలుత రూ.22 కోట్లకు అప్పనంగా, ఆపై వైసిపి నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరో రూ. 5 కోట్లు ఎక్కువ ఇచ్చి ఈ భూములను చౌకగా కొట్టేసేందుకు చూశారని పిటిషనర్ వాదించారు.

వేలంలో కచ్చితంగా పాల్గొనాలి

వేలంలో కచ్చితంగా పాల్గొనాలి

ఏపీ ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరిస్తూ హైకోర్టు నిర్ణయించిన తేదీల్లోనే వేలం నిర్వహించాలని తీర్పిచ్చింది. ప్రతివాది, పిటిషనర్ ఆళ్ల వేలంలో కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించింది. వేలంలో పాల్గొనకుంటే ఇప్పటికే కట్టిన రూ.10 కోట్లు జఫ్తు చేస్తామని తెలిపింది. హైకోర్టు కంటే తక్కువ ధర కోట్ చేస్తే రూ.15 కోట్లు ఫైన్ ఉంటుందని చెప్పింది.

సదావర్తి భూములు

సదావర్తి భూములు

కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme Court orders on Sadavarthi lands on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X