కోడి పందేల కేసు: 12కు వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలా వివాదానికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు, పీపుల్ ఫర్ యానిమల్‌ను కోడి పందేల కేసులో ప్రతివాదులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వ విజప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సవరించిన పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.
కోడి పందేల నిర్వహణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పీపుల్ ఫర్ యానిమల్ గౌరీ మూలే తమ తరపున ఒక పిటిషన్ దాఖలు చేస్తారని తెలిపింది. కోడి పందేల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బిజెపి నేత రఘురామకృష్ణరాజు మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కోడి పందాల నిర్వహణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు జారీ చేసిన ఆదేశాలను తమ పరిశీలనకు పంపించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అందవలసి ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డును ప్రతివాదులుగా చేర్చిన సుప్రీం కోర్టు.. తాజాగా సవరించిన పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా కోడి పందేల కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, 2014లోనే కోడి పందాలను కోర్టు నిషేధించింది, కాబట్టి ఈ కోసులో తమను కూడా చేర్చాలని జాతీయ వన్యప్రాణి రక్షణ కార్యదర్శి అంజలి శర్మ విజప్తి చేశారు.












Click it and Unblock the Notifications