జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తేల్చేసిన సుప్రీంకోర్టు..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు సుప్రీం లో పిటీషన్లు దాఖలు చేసారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసం ఈ పిటీషన్ల పైన కీలక నిర్ణయం వెల్లడించింది. ఇదే సమయంలో పిటీషన్ల దాఖలు.. విచారణ పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. తాజా నిర్ణయం జగన్ కు ఊరట ఇవ్వనుంది.

మాజీ సీఎం జగన్ పై రఘురామ రాజు దాఖలు చేసిన కేసుల్లో సుప్రీం కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ కేసుల విచారణలో జాప్యం పై రఘురామ సుప్రీంను ఆశ్రయించారు.
దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ కేసులు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. కేసులను మిమ్మల్ని పర్యవేక్షించమంటారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. బెయిల్ రద్దుకు కారణాలు లేవని వ్యాఖ్యానించింది. రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటీషన్ ను డిస్మిస్ చేస్తామని పేర్కొనటంతో రఘురామ తరపు న్యాయవాది తమ పిటీషన్ ఉప సంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.

Supreme court Rejects Raghu Rama Raju petitions against YS Jagan details here

దీంతో, జగన్ బెయిల్ రద్దు .. జగన్ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటీషన్ల విషయంలో జగన్ కు ఇప్పుడు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ పిటీషన్ పైన విచారణ చేసిన జస్టిస్ నాగ రత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసుల్లో గత 12 ఏళ్ల కాలంగా విచారణ ముందుకు వెళ్లటం లేదని రఘురామ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో జగన్ తో పాటుగా సీబీఐ వాదనలు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కేసుల వివరాలు.. విచారణ స్థితిని వివరిస్తూ సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక, సుప్రీంకోర్టు లో ఇప్పడు రఘురామ తన పిటీషన్లను విత్ డ్రా చేసుకోవటంతో జగన్ కు భారీ ఊరట దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+