అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ - ఏపీ కేబినెట్ కీలక భేటీ..!!
ఏపీలో ఎన్నికల కసరత్తు వేగవంతం అయింది. ఎన్నికలకు ప్రధాని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎన్నికల అజెండాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోంది. టీడీపీ, ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ నెల 11న సుప్రీంకోర్టు అమరావతి పైన విచారణ చేపట్టనుంది. ఈ మరుసటి రోజునే ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో, ఉత్కంఠ పెరుగుతోంది.
సుప్రీంలో అమరావతి కేసు విచారణ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని కోరింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు దాఖలు చేసిన కేసులు ఈ నెల 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. విచారణ కోసం నెంబర్ 41కింద కేసులు లిస్టు అయ్యాయి.
11న విచారించనున్న ధర్మాసం
ఇది వరకు ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మానసం విచారించింది. చివరిసారిగా ఈ కేసులను ఆ ధర్మాసనం మే 17న విచారించింది. తాను జూన్ 16న పదవీ విరమణ చేయబోతున్నందున ముఖ్యమైన ఈ కేసునుల విచారించి తీర్పు వెలువరించే సమయం లేదన్న కారణంగా జస్టిస్ కేఎం జోసెఫ్ జూలై 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేసారు. ఇక, సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే మూడు రాధానులే తమ విధానమని వైసీపీ స్పష్టం చేసింది.
12న కేబినెట్ భేటీలో చర్చ
వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా తన పాలన సాగుతుందని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ నెల 11న సుప్రీంలో విచారణ ఉండగా, 12న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సుప్రీంలో జరిగే విచారణ మరుసటి రోజునే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయటం ఆసక్తి కరంగా మారుతోంది.

కోర్టు తీర్పు ఆలస్యం అయితే ముఖ్యమంత్రిగా ఎక్కడి నుంచి అయినా పాలన చేసేందుకు ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం పైన కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు అమరావతి వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలో సుప్రీంకోర్టు విచారణ..కేబినెట్ నిర్ణయాల పైన ఆసక్తి పెరుగుతోంది.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications