సుప్రీంలో ఏపీ రాజధాని కేసు విచారణలో కీలక అప్ డేట్..!!

ఏపీ రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 9న విచారణ జరగనుంది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. వీటిపైన విచారణను జూలై 11వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారని, వారి స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్‌ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు.

సుప్రీంలో ఏపీ రాజధానుల కేసు:ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు గతంలో విచారణ సమయంలో వేసవి సెలవుల తరువాత జూలై 11న విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారు. వారి తరపున చట్టబద్ద వారసులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని గత విచారణ సందర్భంగా ప్రతివాదుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ నాడు ధర్మాసనంకు నివేదించారు. ఈ విషయం తమకు తెలియదని , ప్రతివాదుల చట్టబద్ద వారసులను గుర్తిస్తూ పిటీషన్ దాఖలు చేస్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు.

Amaravati farmers arguments in AP Capital case on may 9th

మే 9న విచారణకు నిర్ణయం:చట్టబద్ద వారసులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు (ఐఏ) దాఖలు చేసింది. దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 9న జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ లిస్టులో ఈ కేసు చేరింది. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించి విచారణ చేసిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాల పైన స్టే ఇచ్చింది. ఏపీ శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదంటూ హైకోర్టు పేర్కొనటం పైన ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంను కోరింది.

సుప్రీం నిర్ణయం తరువాతే:అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు విధించిన కాల పరిమితి పైన సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణ వేగవంతం చేయాలని పలుమార్లు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరంది. వేసవి సెలవుల తరువాత విచారణ చేపడతామని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరింత త్వరగా విచారణ జరిగేలా చూడాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్ధించింది. మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వ్యవహారం తేలిన తరువాత ముందుడుగు వేయాలనే ఆలోచనలో ఉంది. అటు ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖకు తాను మకాం మారుస్తున్నట్లు ప్రకటించారు. రాజధానుల కేసులో సుప్రీంలో విచారణ..తుది తీర్పు ఏపీకి కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+