వివేకా హత్య కేసు విచారణ ముగిసిందా- ఏం జరుగుతోంది..!!
రాష్ట్రంలో సంచలనానికి కారణమైన వివేకా కేసులో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కేసు విచారణకు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసింది. జూన్ నెలాఖరులోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇటు సీబీఐ మాత్రం తాజాగా కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో అనేక అంశాలను ప్రస్తావించింది. అనుమానితుల పేర్లు ప్రస్తావించింది. ఇంకా విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ పరిణామాల క్రమంలో ఈ రోజు సుప్రీం నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది.
సుప్రీంకోర్టులో వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పిటీషన్ దాఖలు చేసారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకే ఉందని స్పష్టం చేయాలని కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ దరఖాస్తులో సునీత ఇంప్లీడ్ అయ్యారు. హత్య విషయంలో కృష్ణారెడ్డి ముందుగా సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆయన బాధితుడు కాదని, కుటుంబ సభ్యుడు కూడా కాదని ఆమె పేర్కొన్నారు. ఈ సమయంలో దస్తగిరి తనకు న్యాయవాదిని పెట్టుకొనే సమర్ధత లేదని..సుప్రీంకోర్టు న్యాయం చేయాలని కోరారు. కృష్ణారెడ్డి బాధితుడు కాదని, దర్యాప్తును అడ్డుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని సునీతారెడ్డి పేర్కొన్నారు.

ఈ విషయంలో సునీత పిటీషన్ పైన ఏ విధమైన వాదనలు వినిపిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో తెలంగాణ హైకోర్టు అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వటం పైనా సుప్రీంలో సునీత పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ విచారణను సుప్రీం వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30వ తేదీ నాటికే హత్య కేసు దర్యాప్తు పూర్తికావలసి ఉంది. ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు గడువును పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ల విచారణ నేపథ్యంలో..ఈ కేసు విచారణకు సుప్రీం మరోసారి గడువు పొడిస్తుందా..లేక ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేతి ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications