చంద్రబాబుకు భారీ షాక్ - క్వాష్ పై సుప్రీం కీలక నిర్ణయం..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్. చంద్రబాబు అండ్ టీం ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్ పైన తీర్పును సుప్రీం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల (నవంబర్) 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో, ఆ తరువాతనే చంద్రాబాబు బయటకు ఎప్పుడనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తీర్పు వచ్చే నెల 8న : చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టులో కొట్టేసిన క్విష్ పిటీషన్ పైన చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ.. ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు. రేపటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ తీర్పుకు సంబంధించి ఈ రోజున న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో తీర్పును నవంబర్ 8న వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో, అప్పటి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Supreme Court to pronounce judgement on Chandra Babu Quash petiion on November 8th

బెయిల్ పైన విచారణ వాయిదా : ఇక, ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖుల చేసిన ఎస్ఎల్పీ ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. తన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో ఈ నెల 13న విచారణకు వచ్చిన సమయంలో 18వ తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగించింది. ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందనే లూద్రా వాదించారు. స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తరువాత దీని పై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును 17వ తేదీకి వాయిదా వేసారు. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో తిరిగి ధర్మాసనం తిరిగి ఈ కేసును నవంబర్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ : స్కిల్ కేసులో అనితీని నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ చంద్రబాబు తరపు న్యాయవాదులు...సీఐడీ తరపు న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా హోరా హోరీ వాదనలు జరిగాయి. న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో ఇరు పక్షాలు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయటానికి ఈ రోజు సుప్రీం చివరి రోజుగా నిర్దేశించింది. ఇక, ఇప్పుడు క్వాష్ పిటీషన్ పైన తీర్పును వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయటంతో..ఇప్పుడు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. అటు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగించింది. తాజా పరిణామాలతో చంద్రబాబు ఇక నవంబర్ 8వ తేదీ సుప్రీం తీర్పు తరువాతనే ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+